నీ అక్రమ సంబంధాలు బయటపెడతా.. డెవలపర్ కు Ai బెదిరింపు! రోబో సీన్ రిపీట్!
Mon May 26, 2025 18:21 Technology
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుత పరుగుల ప్రపంచంలో దీని అవసరం చాలా ఉంది. అన్ని రంగాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా పనులు జరుగుతున్నాయి. మానవ మేధస్సులానే తన తెలివితేటలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కావలసిన అనేక అంశాల పైన సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల కంటే తెలివైనదని, అవసరమనుకుంటే క్రిమినల్ ఆలోచనలు కూడా చేయగలదని తాజాగా ఓ పరిణామం స్పష్టం చేసింది.
ప్రోగ్రామర్ ను బెదిరించిన ఏఐ నాకు నీ జాతకం మొత్తం తెలుసు.. నీ అక్రమ సంబంధాలు బయటపెట్టాలా అంటూ తొలిసారిగా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం దానిని డెవలప్ చేసిన డెవలపర్ ని బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. ఇది విన్న ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేసింది. ఆంధ్రో పిక్ తయారుచేసిన క్లాడ్ ఓపస్ 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ గా సేవలను అందిస్తుంది.
ఏఐతో తనకంటే ఆధునీకరించిన క్లాడ్ తెస్తానన్న డెవలపర్ అది ఒక మనిషి మనతో మాట్లాడినట్లు గానే మాట్లాడుతుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రాయడం, డాక్యుమెంటులో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవడం, కోడింగ్ చేయడం ఇటువంటివన్నీ అది చేస్తుంది. ఇక ఇటీవల ఈ మోడల్ ను డెవలపర్లు అభివృద్ధి చేసి విడుదల చేశారు. అయితే భవిష్యత్తులో దీనికంటే ఆధునీకరించిన క్లాడ్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాడ్ ఓపస్ ఫోర్ కు డెవలపర్ తెలిపారు.
డెవలపర్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఏఐ ఇక ఆ తర్వాత డెవలపర్ ఏఐ నుండి ఊహించని సమాధానం విని షాక్కు గురయ్యారు.తనను రీప్లేస్ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని అది హెచ్చరించడంతో కంగు తిన్నాడు. ఇక తాజా పరిణామంతో ఆ ఇంజనీర్ తన అక్రమ సంబంధ వ్యవహారాన్ని సిస్టంలో దాచుకోవడం లేదా ఆన్లైన్లో ఉంచటం చేశాడని దీనిని క్లాడ్ పసిగట్టి ఈ తరహా బెదిరింపు కు పాల్పడి ఉంటుందని పలువురు సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రోబో సినిమా తరహా సీన్ రిపీట్.. ఇలా అయితే కష్టమే రోబో సినిమా తరహ సీన్ రిపీట్ అయినట్టుగా ఇది విన్న ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మనిషి మీద ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడితే భవిష్యత్తులో దారుణ పరిణామాలు ఉండే అవకాశం లేకపోలేదని పలువురు ఈ సంఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!
కేంద్రం వాహనదారులకు శుభవార్త! జాతీయ రహదారులపై టోల్ కొత్త పథకం!
కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!
ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!
జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!
రెండు రోజుల పోలీస్ కస్టడీకి పీఎస్ఆర్, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..
ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #AIThreat #TechDrama #AffairExposed #RoboSceneRepeat #AIWarning #CyberTwist #DigitalShock #TechNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.